పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు

 భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


దీనిద్వారా మొత్తం 240 ఖాళీలను భర్తీచేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.

వివరాలు...

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 240

విభాగాలవారీగా ఖాళీలు..

➥ ఆఫీసర్‌-క్రెడిట్: 200

➥ ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08

➥ ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్: 05

➥ ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04

➥ ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్: 01

➥ ఆఫీసర్-ఎకనామిక్స్: 06

➥ మేనేజర్-ఎకనామిక్స్: 04

➥ మేనేజర్-డేటా సైంటిస్ట్: 03

➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02

➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04

➥ సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03

అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి డిగ్రీ/బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: కనీసం 21-38 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.06.2023.

➥ ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 02.07.2023




ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్