తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా... 5 వేల ఉద్యోగాలకు ఉదయం ఇంటర్వ్యూలు.. సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు..

 తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి.



తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు (Job Mela) ఏర్పాట్లు సాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు లోని ట్రినిటి విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.



ఆ రోజు ఉదయం 8 గంటలకే నిరుద్యోగులు పెద్దపల్లికి వచ్చి తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఉదయం నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎంపికైన వారికి సాయంత్రమే నియామకపు పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలను పొందాలని ఆయన సూచించారు.

విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీఎస్సీ, ఎంటెక్, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, హోటల్ మేనేజ్మెంట్, పీజీ, ఐటీఐ, డ్రైవర్ తదితర అర్హత కలిగిన వారంతా ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. ఫ్రెషర్స్/అనుభవం ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు




Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్