పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. అయితే డేంజర్‌లో పడినట్లే..

 ఇంటికి చుట్టమొస్తే మొదటి ఇచ్చేది టీ. నలుగురు మిత్రులు కలవగానే తాగేది టీ. డ్రైవింగ్ లో నిద్రొస్తే గుర్తొచ్చేది టీ. ఎగ్జామ్స్ ముందు నిద్రొస్తే విధ్యార్ధులకు గుర్తొచ్చేది టీ. 




అందుబాటు ధరలో బంధాలను, అనుబంధాలను బలపరిచే ఏకైక పదార్ధం టీ. అటువంటి టీ పింగాణి కప్పులలో మితంగా తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో. అదే టీ ని పేపర్ కప్పులలో త్రాగితే అది మీ ప్రాణాలను హరించే విషంతో సమానం అంటున్నారు వైద్యులు. ఈ రోజుల్లో ఏ టీ స్టాల్ దగ్గర చూసినా పేపర్ కప్పులు విరివిగా వాడుతున్నారు.ఐతే ఆ పేపర్ కప్పులు మీకు క్యాన్సర్ ముప్పునుకొని తెస్తున్నాయని మీలో ఎంతమందికి తెలుసు..? చదువుకున్న వాళ్లు కూడా కాగితం (పేపర్) కప్పులల్లో టీ, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ (Cancer) ని కొనుక్కుంటున్నారు.



ప్లాస్టిక్ వాడకం పై నిషేధం కొంత మేర అమలుచేస్తున్న ప్రభుత్వం పేపర్ కప్పుల నిషేధం పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ చేసేందుకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని కొందరు విమర్శిస్తున్నారు. మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టి తాగరు.


కాగితం కప్పులు తయారు చేయడాని దాదాపు 15 రకాల కెమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువ. కాగితం కప్పు మెత్తబడుకుండా ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటికి వచ్చి టీలో కలుస్తాయి. అలా కెమికల్స్ కలిసిన టీ మీ శరీరం లోకి ప్రవేసిస్తే అది మీ శరీరంలో క్యాన్సర్ తో పాటు ఎన్నోరకాల వ్యాధులకు కారకం అవుతుంది.ఒక్క టీ అనేదే కాదు పేపర్ కప్పులలో సేవించే ఏవిధమైన వేడి పదార్ధాలైనా సరే హానికారకమే...

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.