High Court : తెలంగాణ హైకోర్టులో 96 జాబ్స్.. డిగ్రీ అర్హత.. జూన్ 15 చివరి రోజు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టుల్లో.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 96 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అంటే ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే కేవలం టైపింగ్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నిమిషానికి 45 ఇంగ్లిష్ పదాలను టైప్ చేసే సామర్ధ్యం ఉండాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాలు టైప్ చేయగలగాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 15వ తేదీ రాత్రి 11:59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్‌లో (స్కిల్ టెస్ట్) మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ జులైలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు జీతం ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tshc.gov.in/getRecruitDetails వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్యమైన లింక్స్
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment