IDBI: ఐడీబీఐ బ్యాంకులో 1000కి పైగా ఉద్యోగాలు

 ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది





తాజాగా ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐడీబీఐ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు పరిశీలిద్దాం.






కేటగిరీ వారీగా ఖాళీలు

జనరల్-451

ఓబీసీ-255

ఈడబ్ల్యూఎస్-103

ఎస్సీ-160

ఎస్టీ-67

అప్లికేషన్ తుది గడువు

ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక పోర్టల్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ గడువు జూన్ 7న ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఐడీబీఐ బ్యాంక్ 1036 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది.

అర్హత ప్రమాణాలు

అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణతను అర్హతగా పరిగణించరు..

అప్లికేషన్ ప్రాసెస్

  1. ముందు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక పోర్టల్ idbibank.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో కెరీర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను సమర్పించి రిజిస్టర్ అవ్వాలి..
  2.  ఇప్పుడు మీ ఇమెయిల్‌కు రిజిస్టర్డ్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది. వాటి సహాయంతో లాగిన్ అవ్వాలి..
  3.  ఆ తర్వాత ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ అప్లికేషన్‌ ఓపెన్ చేసి అన్ని వివరాలు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్ మిట్ చేయాలి..

 అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్ (OT), ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌ జులై 2న జరగనుంది.

 ఎగ్జామ్ ప్యాట్రన్

ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ-40, లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు ఆన్సర్‌కు 0.25 మార్కును కట్ చేస్తారు. ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది.

కాగా, ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఒక సంవత్సరం సర్వీస్ కోసం కాంట్రాక్ట్ పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అవసరం అనుకుంటే మరో రెండేళ్లు సర్వీస్ పీరియడ్‌ను పొడిగించవచ్చు. అయితే ఇది అభ్యర్థి పనితీరుపై ఆధారపడి ఉంటుంది.



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్