నవోదయ విద్యాలయాల్లో 7,629 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

 నవోదయ విద్యాలయ సమితి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వీటిలో పీజీటీ, టీజీటీ టీచింగ్ పోస్టులతోపాటు, పలు విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


అర్హత ప్రమాణాలు


పీజీటీ(కంప్యూటర్ సైన్స్)

ఈ ఉద్యోగాల్లో 306 భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. B.Ed కూడా తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.


పీజీటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్)

ఈ పోస్ట్‌లు 91 భర్తీ కానున్నాయి. అభ్యర్థులు M.P.Ed క్వాలిఫై అయి ఉండాలి. వారి వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.


PGT (మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్)

ఈ విభాగంలో భర్తీ కానున్న పోస్టులు 46. సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. B.Ed కూడా పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.


టీజీటీ (కంప్యూటర్ సైన్స్)

భర్తీ కానున్న పోస్టులు 649 కాగా, కంప్యూటర్ సైన్స్‌లో బీసీఏ/బీఎస్సీ చదివి ఉండాలి. లేదా బీటెక్‌లో సీఎస్/ఐటీ పూర్తిచేసి ఉండాలి. బీఈడీ, సీటెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.


టీజీటీ(ఆర్ట్)

ఈ విభాగంలో 649 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫైన్ ఆర్ట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈడీ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.


టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్)

భర్తీకానున్న పోస్టులు 1244. దరఖాస్తుదారులు B.P.Ed పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.


టీజీటీ(మ్యూజిక్)

అభ్యర్థులు మ్యూజిక్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారి వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. భర్తీకానున్న పోస్టులు 649. ఇంకా చాలా రకాల పోస్టులను నవోదయ విద్యాలయ సమితి భర్తీ చేయనుంది. పోస్ట్‌ను బట్టి అర్హత ప్రమాణాలు, వయో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి.


అప్లికేషన్ ప్రాసెస్

Step 1: ముందు నవోదయ విద్యాలయ సమితి అధికారిక పోర్టల్ navodaya.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 2: అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

Step 3: అన్ని పోస్టుల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న దానికి అప్లై చేసుకోవాలి.

Step 4: అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.


ఎంపిక ప్రక్రియ


అభ్యర్థుల ఎంపికలో ముందు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ నవోదయ విద్యాలయ త్వరలో ప్రకటించనుంది.


జీతభత్యాలు

టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.18,000 నుంచి ప్రారంభమవుతుంది...



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్