డిగ్రీ తో మెట్రోలో 22 ఉద్యోగాలకు నోటిఫికేషన్...
మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MMRCLలో మేనేజర్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు..
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు MMRCL mmrcl.com అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 21న ప్రారంభమైంది.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు..
ఖళీ పోస్టులు..
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్:- 5 పోస్టులు
2. జూనియర్ ఇంజనీర్-II (ట్రాక్):- 4 పోస్టులు
3. ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫైనాన్స్):- 2 పోస్టులు
4. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్:- 2 పోస్టులు
5. డిప్యూటీ జనరల్ మేనేజర్:- 2 పోస్టులు
6. జనరల్ మేనేజర్:- 1 పోస్ట్
7. డిప్యూటీ ఇంజనీర్:- 1 పోస్ట్
8. ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్:- 1 పోస్ట్
9.సూపర్‌వైజర్ (ఆపరేషన్ సెక్యూరిటీ):- 1 పోస్ట్
10. సూపర్‌వైజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్):- 1 పోస్ట్
అర్హతలు...
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దిగువ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా తమ విద్యార్హతను చెక్ చేసుకోవచ్చు.
వయో పరిమితి...
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు పోస్ట్ ప్రకారం 55/50/40/35 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది...
జీతం ఎంత...
పోస్టు ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.34,020 నుంచి రూ.2,80,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక ఇలా...
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులు సంబంధిత రంగంలో వారి అర్హత/అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు MMRCL అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:- 21 జూన్ 2023
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ:- 01 ఆగస్టు 2023
అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు.. విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి..
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR),
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, MMRCL – లైన్ 3 ట్రాన్సిట్ ఆఫీస్, E బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (తూర్పు), ముంబై- 400051 అడ్రస్ కు పంపించాలి...
దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Hyderabad metro station anukuna
ReplyDelete