నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో 6030 బ్యాంకు ఉద్యోగాలు..
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో 6030 బ్యాంకు ఉద్యోగాలు
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో జులై 21లోపు అప్లై చేసుకోవచ్చు
ఐబీపీఎస్ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశంలోని వివిధ బ్యాంకుల్లో భారీ స్థాయిలో 6030 క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
* అర్హత ప్రమాణాలు
క్లర్క్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అంటే అభ్యర్థులు 1995 జులై 2 నుంచి 2003 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్‌లో భాగంగా గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి వ్యాలీడ్ మార్క్ షీట్ సమర్పించాల్సి ఉంటుంది.
* అప్లికేషన్ ప్రాసెస్
- ముందు ఐబీపీఎస్ అధికారిక పోర్టల్ ibps.in విజిట్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘CRP క్లర్క్ అప్లికేషన్’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇమెయిల్, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు
అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ , నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. మొదటి ఫేజ్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారు రెండో దశలో జరిగే మెయిన్స్ ఎగ్జామ్‌కు అర్హత సాధిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే పోస్టింగ్‌కు ఎంపిక చేస్తారు. ఈ రెండు పరీక్షలు ఆగస్టు/సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగనున్నాయి. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు, మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది.
* ఎగ్జామ్ ప్యాట్రన్
ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో మూడు సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
* జీతభత్యాలు
క్లర్క్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య జీతం లభిస్తుంది. అలాగే హౌస్‌రెంట్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటాయి..
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment