నిరుద్యోగులకు అలర్ట్.. 904 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది. సౌత్ వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది.
ట్రైనీ ఉద్యోగిగా చేరి ఏడాది కాలం స్టైఫండ్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. హుబ్బళ్లిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే, మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు హుబ్బళ్లి RRC అధికారిక వెబ్‌సైట్ rrchubli.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జులై 3న ప్రారంభమైన అప్లికేషన్ ప్రాసెస్, ఆగస్టు 2న ముగియనుంది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.
* విద్యార్హత, వయసు
- 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల్లో కనీసం 50% మొత్తం మార్కులు పొంది ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఖాళీ వివరాలు
- హుబ్బళ్లి డివిజన్‌లో 237 పోస్టులు,
- క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (హుబ్బల్లి)లో 217 పోస్టులు,
- బెంగళూరు డివిజన్‌లో 230 పోస్టులు,
- మైసూరు డివిజన్‌లో 177 పోస్టులు,
- సెంట్రల్ వర్క్‌షాప్ (మైసూరు) 43 పోస్టులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
రైల్వే బోర్డు నియమాలు, ఆదేశాల ప్రకారం అన్ని ట్రేడ్‌లకు శిక్షణా కాలం ఒక సంవత్సరం ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో ఎలాంటి హాస్టల్ వసతి లభించదు. ఈ పోస్టులకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే, అభ్యర్థులు swractapp2223@gmail.com మెయిల్ ద్వారా బోర్డుని సంప్రదించవచ్చు.
* అప్లికేషన్ ప్రాసెస్
- అధికారిక వెబ్‌సైట్ rrchubli.inకి వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేయాలి..
- - కొత్త యూజర్లు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలతో అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి..
- - అవసరమైన డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేయాలి..
- - అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి..
- - భవిష్యత్తు అవసరాల కోసం సబ్మిట్ చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి..
Okk interst sir
ReplyDeleteVeeresh
ReplyDeleteVeeresh
ReplyDeleteSaikumarsaikumar@gmail.com
ReplyDeleteచెప్పండి సాయికుమార్
DeleteSaikumarsaikumar@gmail.com
ReplyDeleteSuper
ReplyDelete