డిగ్రీ అర్హత తో బ్యాంక్ లో క్లార్క్ జాబ్స్

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ ఐబీపీఎస్ పలు క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .



ఈ నోటిఫికేషన్ ద్వారా 4500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా వీటి దరఖాస్తుల గడువు పొడిగించబడింది.

(ఐబీపీఎస్‌), 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XIII నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో మరో 500 పోస్టులను పెంచుతూ ఐబీపీఎస్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 4,045 ఖాళీలుండగా.. ఇప్పుడా సంఖ్య 4,545కు చేరింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణ‌త‌తో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జులై 21 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చని మొదట పేర్కొన్నారు.

తాజాగా ఐబీపీఎస్ మరో నోటీస్ విడుదల చేసింది. దరఖాస్తుల ముగింపు ప్రక్రియను మరో వారంలో రోజులు వాయిదా వేసింది. ఆ గడువును జులై 28 వరకు పొడిగించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 28 లోపు https://www.ibps.in/ లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్‌డ్ ఆన్‌లైన్ టెస్ట్ (సీబీటీ) ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య జీతం చెల్లిస్తారు. అలాగే హౌస్‌రెంట్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ కూడా ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

-ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

-ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ: ఆగస్టు, 2023.

-ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఆగస్టు, 2023.

-ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు (ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 26.08.2023, 27.08.2023, 02.09.2023.

-ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబరు/అక్టోబరు 2023.

-మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబరు/ అక్టోబరు, 2023.

-మెయిన్ పరీక్ష తేదీ(ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం): 07.10.2023.

-ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.

ఎగ్జామ్ ప్యాట్రన్..

ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో మూడు సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలివే.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు , కడప , కాకినాడ, కర్నూలు, నెల్లూరు , ఒంగోలు, రామహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ , విశాఖపట్నం , విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌; ఖమ్మం, వరంగల్‌. మెయిన్స్‌ పరీక్షను గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖ నగరాలతో పాటు హైదరాబాద్‌, కరీంనగర్‌లో నిర్వహించనున్నారు.




ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్