కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు....
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి.
తాజాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), మంచి జీతంతో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ cotcorp.org.in లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ గడువు ఆగస్టు 13న ముగుస్తుంది. సీసీఐ ఈ రిక్రూట్‌మెంట్‌తో మొత్తం 93 ఖాళీలను
ఖాళీల వివరాలు
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-81 పోస్టులు,
- మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-6 పోస్టులు,
- మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్)-6
ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
అర్హతలు
- అభ్యర్థుల వయసు జులై 24 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
- పోస్ట్‌ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేర్వేరుగా ఉన్నాయి.
- మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్) ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి.
- మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్) పోస్టులకు కామర్స్, ఫైనాన్స్‌లో పీజీ పూర్తిచేసి ఉండాలి.
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో B.Sc అగ్రికల్చర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 45 శాతం స్కోర్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం
- - ముందు సీసీఐ అధికారిక పోర్టల్ cotcorp.org.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, సీసీఐ రిక్రూట్‌మెంట్-2023 లింక్‌పై క్లిక్ చేయాలి.
- - దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవసరమైన పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- - ఈ రిజిస్టర్ ఐడీతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అర్హత ఉన్న పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
- - అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అన్ని కేటగిరీ అభ్యర్థులు అదనంగా రూ.500 ఇంటిమేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు రాత పరీక్ష, రెండో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
జీతభత్యాలు
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు నెలకు జీతం రూ.22000 నుంచి 90,000 మధ్య లభిస్తుంది.
మేనేజ్ మెంట్ ట్రైనీ(మార్కెటింగ్), మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్) అభ్యర్థులకు జీతం రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment