ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 100 టెక్నికల్‌ ఆఫీసర్ ఉద్యోగాలు...

 హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 


దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 10, 11 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 100

* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: సంబంధిత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి.

ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వెయిటేజీ / మార్కులు: సంబంధిత ఇంజినీరింగ్ పర్సంటేజ్‌లో 20 మార్కులు; పని అనుభవానికి ఒక సంవత్సరం అనుభవానికి 10 మార్కుల చొప్పున ప్రతి అదనపు సంవత్సరం గరిష్టంగా ప్రారంభ మార్కులతో కలిపి 30 మార్కుల వరకు; పర్సనల్ ఇంటర్వ్యూకి 50 కేటాయించారు. 

జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.25,000; రెండవ సంవత్సరం నెలకు రూ.28,000; మూడు & నాలుగు సంవత్సరాలకు నెలకు రూ. 31000 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: Corporate Learning & Development Centre, 
                                 Nalanda Complex, TIFR Road, 
                                 Electronics Corporation of India Limited, 
                                 ECIL Post, Hyderabad – 500062.

ముఖ్యమైన తేదీలు..

ఇంటర్వ్యూ తేదీ: 10-08-2023 & 11-08-2023 (రిజిస్ట్రేషన్ సమయం ఉదయం 09.00  - ఉదయం11.30  రెండు రోజుల్లో)



నోటిఫికేషన్ కోసం CLICK HERE
అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి CLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.