విద్యార్థులు అలర్ట్ వెంటనే ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయండి
టాలెంట్ ఉన్నా మంచి కాలేజీలలో చదువుకునే ఆర్థిక స్థోమత లేక చాలామంది విద్యార్థులు సాధారణ కాలేజీల్లో చదువు పూర్తి చేస్తుంటారు.
డిగ్రీ పట్టా చేతికందినా మంచి ఉద్యోగాలు పొందలేక సతమతమవుతుంటారు. ప్రతిభావంతులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదని విద్యా సంస్థలు, ఫౌండేషన్లు లేదా ప్రభుత్వాలు స్కాలర్షిప్ (Scholarships) అందిస్తున్నాయి.
మెరిట్ స్టూడెంట్స్ ఈ స్టైఫండ్, ఫెలోషిప్తో మంచి కాలేజీలో జాయిన్ అయ్యి భవిష్యత్తును మార్చుకోవచ్చు.
ఏడాది పొడవునా కొన్ని స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి. ఆగస్టులో అప్లై చేసుకోవాల్సినవి ఏవో చూద్దాం.
మెరిట్ స్టూడెంట్స్ ఈ స్టైఫండ్, ఫెలోషిప్తో మంచి కాలేజీలో జాయిన్ అయ్యి భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఏడాది పొడవునా కొన్ని స్కాలర్షిప్స్ అందుబాటులో ఉంటాయి. ఆగస్టులో అప్లై చేసుకోవాల్సినవి ఏవో చూద్దాం.
1 రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్షిప్ : 'రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్షిప్ ఫర్ ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్'ను రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేస్తోంది. ఏరోస్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వంటి బ్రాంచెస్లో ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. AICTE-రికగ్నైజ్డ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో 1వ/2వ/3వ సంవత్సరం చదువుతున్నవారు, 10, 12వ తరగతి పరీక్షలలో 60% కంటే ఎక్కువ స్కోర్ చేసినవారు, సంవత్సరానికి రూ.4 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు ఈ స్కాలర్షిప్కు అర్హులు.
సెలక్ట్ అయిన వారికి రూ.35,000 స్కాలర్షిప్ లభిస్తుంది. భారతదేశం అంతటా ఉన్న మహిళా విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. 2022లో ఈ సంస్థ నుంచి స్కాలర్షిప్ పొంది, ఇప్పుడు 4వ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, దివ్యాంగులు, సింగిల్ పేరెంట్ ఉన్నవారు, అనాథలు వంటి ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. https://www.buddy4study.com/page/rolls-royce-unnati-scholarships-for-women-engineering-students సైట్లో అప్లై చేసుకోవచ్చు.
2 రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్షిప్స్ : హీరో ఫిన్‌కార్ప్ మద్దతుతో అందిస్తున్న ‘రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్షిప్-2023’కు ఫైనాన్స్-సంబంధిత కోర్సులను అభ్యసించే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. BBA, BFIA, B.Com (H,E), BMS, IPM, BA (ఎకనామిక్స్), BBS, BBI, BAF, B.Sc. (స్టాట్స్), లేదా ఇతర ఆర్థిక సంబంధిత డిగ్రీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు.
ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.5,00,000 వరకు మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ స్టైఫండ్ కాలేజీ ఫీజుపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2023, సెప్టెంబర్ 15. అర్హత ఉన్నవారు https://www.buddy4study.com/page/raman-kant-munjal-scholarships పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
3 ఇన్స్పైర్ అవార్డ్స్- MANAK స్కీమ్ : ఈ స్కాలర్షిప్ స్కీమ్ 6-10వ తరగతి చదివే గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. జిల్లా లేదా రాష్ట్ర విద్యా అధికారుల ద్వారా అర్హులైన విద్యార్థులను పాఠశాలల యాజమాన్యం ఆన్లైన్లో నామినేట్ చేయవచ్చు. కొత్త పాఠశాలలు ముందుగా నమోదు చేసుకోవాలి.
పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలి, అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన పాఠశాలలు నేరుగా లాగిన్ చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉంది. https://www.inspireawards-dst.gov.in/UserP/children-corner.aspx అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి...
Ela
ReplyDeletemotham etails unnayi kada malli ela ani adigithe ela ?
DeleteVery important
ReplyDelete