ఇంటర్, డిగ్రీ అర్హత.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల విరవాల్లోకి వెళ్తే.. జనరల్ డ్యూటీ (GD) 25 పోస్టులు, టెక్ 20 పోస్టులు, లాలో.. 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్/ BE/ B.Tech/ లా/ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయో పరిమితి
రిక్రూట్మెంట్ కింద.. కమర్షియల్ పైలట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 19 సంవత్సరాలు.. గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. అన్ని ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
ఎంపిక ఇలా..
ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 5 దశలను దాటాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (CGCAT), రెండవ దశలో ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ (PSB), మూడవ దశలో ఫైనల్ సెలక్షన్ బోర్డ్ (FSB), నాల్గవ దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఐదవ దశలో ఇండక్షన్ ప్రక్రియ ఉంటుది. వీటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో చేరుతారు.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. SC/ST మినహా అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫీజు రూ. 250 చెల్లించాలి. అభ్యర్థులు నెట్ బ్యాంకింగ్ లేదా వీసా/మాస్టర్/మాస్ట్రో/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/యూపీఐని ఉపయోగించి ఆన్లైన్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక సైట్joinindiancoastguard.gov.in సందర్శించండి.
జీతభత్యాలు..
ఇండియన్ కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 56,100 వరకు లభిస్తుంది.
అప్లికేషన్ ప్రాసెస్
- - ముందు ఇండియన్ కోస్ట్గాడ్ అధికారిక వెబ్సైట్ www.indiancoastguard.gov.in ఓపెన్ చేయాలి.
- - హోమ్ పేజీలోకి వెళ్లి.. అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- - ఇక్కడ అడిగిన పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అర్హత ఉన్న పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
- - అనంతరం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment