పేద విద్యార్థినులకు రూ. 24 వేలు స్కాలర్ షిప్..

ఇంటర్ తరువాత పై చదువులు చదవటానికి ఆర్థిక స్థోమత లేని అమ్మాయిల నుండి దరఖాస్తులు సంతూర్ విమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా విప్రో సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.




చదవాలనే కోరిక, ఆసక్తి ఉన్నా ఎందరో ప్రతిభావంతులకు పేదరికం అడ్డుగా వస్తుంటుంది. దీని కారణంగా చదువులు కొనసాగించలేకపోతున్నారు. 


అందులోనూ ఆడపిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దీనిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికాంగా ఉంటారు. ఇలాంటి వారిని అదుకొని.. ఆర్థికంగా చదువులో రాణించేలా విప్రో( Wipro) సంస్థ సంతూర్ ఉపకారవేనాలను అందిస్తోంది. వీటికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, యూజీ కోర్సుల్లో చేరిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని విప్రో కేర్స్‌, విప్రో కన్సూమర్‌ కేర్‌(Wipro Consumer Care) అండ్‌ లైటెనింగ్‌ గ్రూప్‌ కలిసి అందిస్తున్నాయి.


ఇవి 2016-17 విద్యా సంత్సరం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ , కర్ణాటక , ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి 1900 మందికి ఈ సారి ఈ స్కాలర్ షిప్ కు అవకాశం కల్పించనున్నారు. గత ఏడేళ్లలో 6000 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. హ్యుమానిటీస్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికీ, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికీ ఎంపికలో కొంత ప్రాధాన్యం దక్కుతుంది. అకడమిక్ లో మెరిట్ విద్యార్థినులను ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాంకు ఎంపిక చేస్తారు..


అర్హతలు..


ఈ స్కాలర్ షిప్ కు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. వీళ్లు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివి ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన బాలికలు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కు అర్హులుగా పేర్కొన్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. అలాగే 2023-24లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు. మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండు వేల చొప్పున ఎంపికైన విద్యార్థినులకు ప్రోత్సాహం అందిస్తారు.


ఈ డబ్బు అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ అవుతాయి. ఈ స్కాలర్ షిప్ డబ్బును ట్యూషన్‌ ఫీజు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా మొత్తం సంవత్సరానికి రూ.24 వేలు అందిస్తారు.


దరఖాస్తు ప్రక్రియ ఇలా..

దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. వీటికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.తమ దరఖాస్తులను 

విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్‌, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక 

అడ్రస్ కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://www.santoorscholarships.com/ సందర్శించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థినులకు కూడా వర్తిస్తుంది.


దరఖాస్తుల సమర్పణకు డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి..

Contact :


Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..