నిమ్స్ లో ఉద్యోగాలు..దరఖాస్తుల ఆహ్వానం..

హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  జారీ చేసింది. 


ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 65 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనెస్థీషియా, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పాథాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.


అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index సందర్శించండి.

 దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా.. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ .


మరో నోటిఫికేషన్..


హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్స్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులను భర్తీ చేశారు.

1. లైబ్రేరియన్ - 01

2. బయోస్టాటిస్టిషియన్ - 01


వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం..  ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000 శాలరీ చెల్లిస్తారు.


లైబ్రేరియన్ పోస్టులకు అర్హతలు..


ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ చేసి ఉండాలి. అంతే కాకుండా.. లైబ్రరీ సైన్స్ లో పీహెచ్ డీ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటితో పాటు.. సంబంధిత పనిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలని తెలిపారు.


ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టాటిస్టిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు.. స్టాటిస్టిక్స్ లో పీహెచ్ డీ పట్టా ఉండాలని తెలిపారు. వీటితో పాటు.. సంబంధిత పనిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలని తెలిపారు.


లైబ్రేరియన్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా.. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్.



 దరఖాస్తు డౌన్లోడ్ చేస్కోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్