డిగ్రీ ఉత్తీర్ణతతో ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..

అసిస్టెంట్‌  మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండ‌స్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది...


ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి.....

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభంకానుండ‌గా.. సెప్టెంబర్ 30వ‌ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నది. విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు.....


మొత్తం ఖాళీలు : 600

పోస్టులు : అసిస్టెంట్‌ మేనేజర్‌

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి.

వయస్సు : 21-25 ఏండ్ల‌ మధ్య ఉండాలి.

ఎంపిక : విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు : ఆన్‌లైన్ లో

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1000

చివరి తేదీ : సెప్టెంబర్ 30

జీతం ఎంత?

మొదటి ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. తర్వాతి రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు నెలకు రూ.15,000 అందుకుంటారు. PGDBF కోర్సును పూర్తి చేసిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ -JAM (గ్రేడ్ 'O')గా బ్యాంకులో జాయిన్ అవుతారు. అప్పుడు సీటీసీ (క్లాస్ A సిటీ) ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది...

ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్‌లైన్ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్ట్ చేస్తారు. మొత్తం 600 పోస్టుల్లో 243 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మిగిలిన 162 ఓబీసీ, 90 ఎస్సీ, 45 ఎస్టీ, 60 ఈడబ్ల్యూఎస్ విభాగాలకు రిజర్వ్ చేశారు.
 అప్లికేషన్ ప్రాసెస్
  • - అర్హత ఉన్నవారు ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో 'కెరీర్' ట్యాబ్ క్లిక్ చేయాలి.
  • - ఇప్పుడు కొత్త పేజీలో కనిపించే ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ అడ్మిషన్ టు IDBI Bank PGDBF – 2023-24.’ లింక్ ఓపెన్ చేయాలి.
  • - తర్వాత అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొని, అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేయాలి.
  • - ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలు నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
  • - జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ..1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి...

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్