అంగన్‌వాడీ కేంద్రాల్లో 14 వేల పోస్టుల భర్తీ - మంత్రి సీతక్క
నిరుద్యోగులకు తీపికబురు. మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ నియామకాలపై అదిరే గుడ్ న్యూస్ అందించారు.
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటించింది. ఇంతకీ ఏ ఏ ఖాళీలను భర్తీ చేయనున్నారు? అనే అంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఖాళీగా ఉన్న నియామకాల భర్తీ వల్ల నిరుద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ మంత్రి సీతక్క తాజాగా ఉద్యోగ నియామకాలపై ముఖ్యమైన ప్రకటన చేశారు.
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలియజేశారు. ఏకంగా 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్న సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు.
అంగన్‌వాడీలో ఉద్యోగ నియామకాల వల్ల ఎక్కువగా మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఈ నియామకాలకు ఎలాంటి అర్హతలను నిర్ణయిస్తుందో చూడాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇలా నియామకాలను చేపట్టనుండటం నిరుద్యోగులకు ఊరట లభించే అంశం అని చెప్పుకోవచ్చు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment