ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1603 పోస్టులు..

 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.





* ఖాళీల వివరాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రధానంగా ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ విభాగాల్లో అప్రెంటిస్‌లను నియమించనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొత్తంగా 1603 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తుంది..

 రాష్ట్రాల వారీగా ఖాళీలు

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఢిల్లీ‌లో 138 పోస్టులు, హర్యానా-82, చండీగఢ్- 14, జమ్మూ కాశ్మీర్-17, పంజాబ్-76, హిమాచల్ ప్రదేశ్-19, రాజస్థాన్-96, ఉత్తర ప్రదేశ్-256, బీహార్-63, ఉత్తరాఖండ్-24, పశ్చిమ బెంగాల్-189, ఒడిషా-45, జార్ఖండ్-28, అస్సాం-96, సిక్కిం-3, త్రిపుర నుంచి 4, నాగాలాండ్ నుంచి 2 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

 అర్హత ప్రమాణాలు

ఐఓసీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 2023 నంబర్ 30 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. పోస్టుల ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ పూర్తిచేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

 ఎంపిక ప్రక్రియ

ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్క్ విధానం లేదు. పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్

  1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక పోర్టల్ iocl.com ఓపెన్ చేయాలి.
  2. హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘అప్రెంటిస్ రిజిస్ట్రేషన్- 2023’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి..
  3. తరువాత ‘అప్లైనౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
  4. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ నింపాలి.
  5.  అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
  6. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

* అవసరమైన డాక్యుమెంట్స్

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కొన్ని కీలక డాక్యమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(వర్తిస్తే), క్యాన్సిల్డ్ చెక్, పాన్‌కార్డ్, బ్లాక్ పెన్‌తో అభ్యర్థి సంతకం స్కాన్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి.


మొత్తం ఖాళీలు: 1603.

పోస్ట్ పేరు: టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

అర్హత: 10, 12 వ తరగతి, ITI, డిప్లొమా(సంబంధిత ఇంజనీరింగ్), డిగ్రీ.

వయస్సు: 18-24 ఏళ్లు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 16-12-2023

చివరి తేదీ: 5-01-2024


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.