యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో 300 పోస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) కార్యాలయాల్లో అసిస్టెంట్ (Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు...
వివరాలు...
* అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 300 పోస్టులు
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు: ఆంధ్రప్రదేశ్-8 పోస్టులు, తెలంగాణ- 3 పోస్టులు.
పోస్టుల కేటాయింపు: యూఆర్-159, ఎస్సీ-30, ఎస్టీ-26, ఓబీసీ-55, ఈడబ్ల్యూఎస్-30.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 30.09.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు, సంస్థ ఉద్యోగులు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 250 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ 40 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్-40 ప్రశ్నలు-50 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్/జనరల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు-50 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్: చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం.
పే స్కేల్: రూ.22,405 - రూ.62,265.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.12.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.01.2024.
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.01.2024.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment