హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పోస్టులు
హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.. పలు విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 31, 2023 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు.. ఎన్‌ఆర్‌ఎస్సీ- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/ బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూదిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు) వీటిల్లో ఏదైనా ఓ చోట పనిచేయవల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత కలిగి వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 09, 2023వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 31, 2023వ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అప్లికేషన్ నింపే సమయంలో దరఖాస్తు రుసుము కింద రూ.600లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు..
పోస్టుల వివరాలు..
- టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33
- టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8
- టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9
- టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2
- టెక్నీషియన్-బి (డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్) పోస్టులు: 2
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDF | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Good job
ReplyDelete