పదవ తరగతితో CBI బ్యాంక్ లో ఉద్యోగాలు ..
బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central bank of india) సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 484 శానిటేషన్ వర్కర్ల సబ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జనవరి 9, 2024. ఈ పోస్ట్ కి అప్లయ్ చేసేముందు ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి.
అర్హత
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి మార్చి 31, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వబడుతుంది..
దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుము అభ్యర్థుల కేటగిరీని బట్టి మారుతుంది. SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.175 (GSTతో సహా) చెల్లించవలసి ఉంటుంది, మిగిలిన అభ్యర్థులందరూ రూ. 850 (GSTతో కలిపి) చెల్లించాలి.
పరీక్షా విధానం
- పరీక్ష సమయం : 90 నిమిషాలు
- రాత పరీక్ష : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు
- ఇంగ్లిష్ భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్ 20
దరఖాస్తుకు ఆఖరి గడువు : 2024 జనవరి 9
నోటిఫికేషన్,అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి.👇👇👇
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment