రేషన్ షాపులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 తెలంగా రాష్ట్ర ప్రభుతం, రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..


నల్లగొండ డివిజన్‌లోని 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి ఆర్డీఓ రవి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి, తాళ్లవెల్లెంల, వేంబాయి, కనగల్‌ మండలంలోని తుర్కపల్లి, లచ్చుగూడెం, కట్టంగూర్‌ మండలంలోని ఊదులూరు, నారగూడెం, పామనుగుండ్ల, యరసానిగూడెం, కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల, తాటికల్‌, నల్లగొండ మండలంలోని పానగల్‌, నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, శాలిగౌరారం మండలంలోని అంబారిపేట, ఊట్కూరు, ఉప్పలంచ, తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం, రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

అర్హత ఉన్నవారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత గ్రామంలో నివసిస్తూ పదో తరగతి అర్హత ఉండి 18 నుంచి 40ఏండ్ల వయసు వారు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జనవరి 12న నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్హత :

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై వుండాలి.
  • సంబంధిత గ్రామ పంచాయితీలో నివాసి అయ్యి ఉండాలి.




Comments

  1. అప్లై చేయడం ఎలా

    ReplyDelete
  2. నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయంలో

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్