టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ కొలువులు

 వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ...


వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)లో రైఫిల్‌మన్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షను నిర్వహిస్తుంది.

మొత్తం ఖాళీలు 26,146
పోస్టు: కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ)/రైఫిల్‌ మన్‌(జనరల్‌ డ్యూటీ)
ఖాళీల వివరాలు
బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎ్‌సఎఫ్‌): 6,174
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎ్‌సఎఫ్‌): 11,025
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌): 3,337
సశస్త్ర సీమ బల్‌(ఎ్‌సఎ్‌సబీ): 635
ఇండియన్‌ టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ): 3189
ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌): 1490
సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎ్‌సఎ్‌సఎఫ్‌): 296
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.
వయోపరిమితి: 2024 జనవరి 01 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2001 జనవరి 2 కంటే ముందు, 2006 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: రూ.21,700 - రూ.69,100 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
సీబీఈ పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ఇది. ఇంగ్లీష్‌, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో దీనిని నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌, ఇంగ్లీ్‌ష/హిందీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జనవరి 1
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ఫిబ్రవరి - మార్చి


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.