డిగ్రీ తో NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు ...రూ.1,25,000 వరకు జీతం..!

జాతీయ రహదారుల నిర్మాణం, మెయింం‌టెనెన్స్ చేపట్టే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), తాజాగా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. 


ఈ సంస్థ కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ nhai.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.  అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కాగా, ఈ గడువు వచ్చే ఏడాది జనవరి 4న ముగుస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) తాజా రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 18 అడ్వైజరీ పోస్టులు భర్తీ చేస్తుంది. అందులో ఒకటి అడ్వైజరీ పోస్ట్ కాగా, మిగతా 17 ఖాళీలు జూనియర్ అడ్వైజరీ పోస్టులు

అడ్వైజరీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్ గ్రూప్‌లో కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్స్ నుంచి రిటైర్డ్ అయిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి కాదు

సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పీఎస్‌యూలు, అటానమస్ సంస్థలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు జాయింట్ సెక్రటరీ, ఆపై హోదాలో పనిచేసి ఉండాలి. దరఖాస్తుదారులకు అటవీ, వ్యవసాయం, ఉద్యానవనం, పర్యావరణ రంగాల్లో కనీసం 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

అర్హత 

జూనియర్ అడ్వైజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే సైన్స్ గ్రూప్‌లో కనీసం డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్స్ నుంచి రిటైర్డ్ అయిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి కాదు.

సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పీఎస్‌యూలు, అటానమస్ సంస్థలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు కనీసం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ లేదా డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ హోదాలో పనిచేసి ఉండాలి. దరఖాస్తుదారులకు అటవీ, వ్యవసాయం, ఉద్యానవనం, పర్యావరణ రంగాల్లో కనీసం 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.


జీతం 

దరఖాస్తుదారుల వయసు 2023 డిసెంబర్ 8 నాటికి 65 ఏళ్లకు మించకూడదు. ఎంపికయ్యే రిటైర్డ్ ఆఫీర్స్‌కు పెన్షన్ రాకుంటే నెలకు జీతం రు.90,000 లభిస్తుంది. పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఆఫీసర్స్ ఎంపికైతే నెలకు రూ.1,25,000 జీతం లభిస్తుంది. ఎంపికయ్యే అభ్యర్థులు రెండేళ్ల పాటు సర్వీస్ అందించాల్సి ఉంటుంది


అప్లికేషన్ ప్రాసెస్ 

 ముందుగా అధికారిక పోర్టల్ nhai.gov.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘NHAI అడ్వైజర్ రిక్రూట్‌మెంట్’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పరిశీలించాలి.- ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి అర్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. - ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ కావాలి.  తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి, ఫారమ్ సబ్‌మిట్ చేయాలి



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.