TS JOB MELA | జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన యువతీ యువకులకు శుభవార్త!

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కల్పన కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.



మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాసులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ సర్టిఫికెట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 28 అనగా గురువారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు సూచించారు.


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేంద్ర తెలిపారు. మరిన్ని వివరాలకు 8919914978, 9985346768, 9866357531 నెంబర్స్‌ను సంప్రదించాలని కోరారు. గతంలో కూడా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళాలు నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు చేసుకోవాలని కోరుతున్నారు.


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                    

                        

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్