ఆర్టీసీలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, డ్రైవర్ పోస్టులే అధికం...

  రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలి స్తోంది.







సంస్థలో కారుణ్య నియామకాలు మినహా గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపో వడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరు గుతుండడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. . ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరింది. దీంతో సిబ్బంది అద నంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభా కర్ తెలిపారు.



ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ లెక్క కట్టింది. ఆర్టీసీ ప్రతిపాదనల్లో మూడింట రెండొం తులు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. దీంతో అత్యధి కంగా కొత్త డ్రైవర్లకు వేతనాల కింద ఏడాదికి రూ. 65.28 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. సిబ్బంది సర్వీసులో మరణిస్తే వారి కుటుంబ సభ్యు లకు కారుణ్య నియామకం కింద ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తోంది. ఈ విభాగంలో దాదాపు 800 మందిని కండక్టర్లుగా తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ కార ణంతో తాజా ప్రతిపాదనల్లో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదించలేదని సమాచారం.

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్