విద్యుత్‌ శాఖలో 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

 తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబరులో విద్యుత్‌ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావల్సి ఉంది. 




 ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4 విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు తేలింది. ఇందులో పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. 

ఈ లెక్కలు తేలితే  నెలలో నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఒక్కో క్యాడర్‌ వారీగా ఖాళీల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. జెన్‌కోలో ఇంకా మరికొందరికి ఇవ్వవల్సి ఉంది. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. డిస్కంలలో కిందిస్థాయిలో అసిస్టెంటు లైన్‌మెన్, జూనియర్‌ లైన్‌మెన్, సబ్‌ ఇంజినీర్లు, సహాయ ఇంజినీరుతోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.

జెన్‌కోలో పదోన్నతులపై వివాదం
  

ఏడేళ్ల క్రితం భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పోస్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యాదాద్రిలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాబోతున్నందున పైస్థాయి పోస్టుల భర్తీకి పదోన్నతులు ఇప్పుడే ఇవ్వాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉత్పత్తి ప్రారంభమయ్యాకే ఇస్తామని జెన్‌కో యాజమాన్యం చెబుతోంది. దీంతో పదోన్నతుల విషయంలో తాడో పేడో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

పెగడపల్లిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్వహణను జెన్‌కోకు అప్పగిస్తారని దానికి అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ నిర్వహణ పనులను టెండరులో ఓ ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. వాటిని కూడా పదోన్నతుల ద్వారా నింపేసి భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సంఘాలు కోరుతున్నాయి. దీనివల్ల పోస్టులు పెరిగి, ఆర్థికభారం పెరుగుతుందని యాజమాన్యం ఆపివేసింది. ఈ వివాదం తేలితేనే మొత్తం ఖాళీ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                   



Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.