Posts

Showing posts from September, 2023

గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కొలువులు.....

Image
 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో  టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌/10+2/అండర్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధులకు సంబంధిత పనిలో 0 నుంచి ఐదేళ్ల వరకు అనుభవం కూడా ఉండాలి...   పోస్టుల వివరాలు... అడ్మిన్ సూపర్ వైజర్: 01  అర్హత:   జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.  ➥ లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 01  అర్హత:   హవల్దార్ (క్లర్క్) స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. అకౌంట్స్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉం...

మీ సొంత వాట్సాప్ ఛానెల్‌ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ కోసం..

Image
  ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్లతో కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తోంది.  సరికొత్త సర్వీసులను తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల భారత్ సహా చాలా దేశాల్లో ఛానెల్స్‌ (Channels) ఫీచర్ లాంచ్ చేసింది. నచ్చిన సెలబ్రిటీలు, వ్యక్తులు, సంస్థల ఛానెళ్లను ఫాలో అవుతూ వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ అన్నీ వాట్సాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలు ఇవ్వకుండా లేదా చాట్స్‌ను గందరగోళంగా మార్చకుండా ఛానెల్స్‌ను ఫాలో అవ్వచ్చు. ఛానెల్స్‌ను వాట్సాప్‌లోని కొత్త అప్‌డేట్స్ ట్యాబ్‌లో యాక్సెస్ చేయవచ్చు. డైరెక్టరీలో ఛానెల్స్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఛానెల్స్ వన్-వే బ్రాడ్‌కాస్ట్ కమ్యూనికేషన్, కాబట్టి వాటిని క్రియేట్ చేసిన వ్యక్తులు మాత్రమే మెసేజ్‌లు పంపగలరు. అంటే వాట్సాప్ ఛానెల్స్‌ గ్రూప్ చాట్ లాగానే ఉంటాయి, కానీ యజమాని మాత్రమే మెసేజ్‌లు సెండ్ చేయగలరు. వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ప్రైవసీ ఫీచర్లు ఏంటి, అడ్మిన్లు ఏం పోస్ట్ చేయగలరు వంటి వివరాలు తెలుసుకుందాం.... *  వాట్సాప్ ఛానెల్‌ క్రియేట్ చేసే ప్రాసెస్ స్టెప్ 1 : వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయాలి....

పేద విద్యార్థినులకు రూ. 24 వేలు స్కాలర్ షిప్..

Image
ఇంటర్ తరువాత పై చదువులు చదవటానికి ఆర్థిక స్థోమత లేని అమ్మాయిల నుండి దరఖాస్తులు సంతూర్ విమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా విప్రో సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదవాలనే కోరిక, ఆసక్తి ఉన్నా ఎందరో ప్రతిభావంతులకు పేదరికం అడ్డుగా వస్తుంటుంది. దీని కారణంగా చదువులు కొనసాగించలేకపోతున్నారు.  అందులోనూ ఆడపిల్లల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దీనిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికాంగా ఉంటారు. ఇలాంటి వారిని అదుకొని.. ఆర్థికంగా చదువులో రాణించేలా విప్రో(  Wipro ) సంస్థ సంతూర్ ఉపకారవేనాలను అందిస్తోంది. వీటికి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, యూజీ కోర్సుల్లో చేరిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని విప్రో కేర్స్‌, విప్రో కన్సూమర్‌ కేర్‌(Wipro Consumer Care) అండ్‌ లైటెనింగ్‌ గ్రూప్‌ కలిసి అందిస్తున్నాయి. ఇవి 2016-17 విద్యా సంత్సరం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ ఏడాది ఏపీ,  తెలంగాణ  ,  కర్ణాటక  , ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి 1900 మందికి ఈ సారి ఈ స్కాలర్ షిప్ కు అవకాశం కల్పించనున్నారు. గత ఏడేళ్లలో 6000 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ తోడ్పాట...

ఇంటర్మీడియట్ పాసైతే చాలు..నెలకు రూ.48వేల జీతంతో ఎస్బీఐలో ఉద్యోగాలు

Image
  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.  బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ... మొత్తం 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 5, 2023 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ జరుగుతోంది ... పోస్ట్ సమాచారం. కంట్రోల్ రూమ్ ఆపరేటర్- 89 ఆర్మర్ - 18 అర్హత. కంట్రోల్ రూమ్ ఆపరేటర్- 12వ తరగతి, గ్రాడ్యుయేట్ ఆర్మర్- 12వ తరగతి వయో పరిమితి. కంట్రోల్ రూమ్ ఆపరేటర్ - 20 నుండి 35 సంవత్సరాలు కవచం - 20 నుండి 45 సంవత్సరాలు రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది. దరఖాస్తు రుసుము. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఎంపిక ప్రక్రియ :  ఆన్‌లైన్ పరీక్ష , ఇంటర్వ్యూ జీతం:  నెలకు రూ. 17,900- 47,920 ఉద్యోగము చేయవలసిన ప్రదేశము. భ...

డిగ్రీ ఉత్తీర్ణతతో ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..

Image
అసిస్టెంట్‌    మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండ‌స్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది... ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి..... రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభంకానుండ‌గా.. సెప్టెంబర్ 30వ‌ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నది. విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు..... మొత్తం ఖాళీలు : 600 పోస్టులు : అసిస్టెంట్‌ మేనేజర్‌ అర్హతలు :   గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి. వయస్సు :  21-25 ఏండ్ల‌ మధ్య ఉండాలి. ఎంపిక :  విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు : ...

నిమ్స్ లో ఉద్యోగాలు..దరఖాస్తుల ఆహ్వానం..

Image
హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  జారీ చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 65 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనెస్థీషియా, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పాథాలజీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://nims.edu.in/index సందర్శించండి.   దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా .. డీన్, నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్ . మరో నోటిఫికేషన్ .. హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్స్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులను భర్తీ చేశారు. 1. లైబ్రేరియన్ - 01 2. బయోస్టాటిస్టిషియన్ - 01 వయోపరిమితి .. అభ్యర్...

పంచాయతీరాజ్‌ లో 740 జాబ్స్.. పోస్టుల వివరాలివే

Image
 పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకణలో భాగంగా 740 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌(Engineering) విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది ఉండేలా సర్కారు చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల కొత్తగా 740 పోస్టులు క్రియేట్‌ కానున్నాయి. జిల్లాల్లో పనుల పర్యవేక్షణకు నాలుగు చీఫ్‌ ఇంజినీర్‌ పోస్టులను మంజూరు చేశారు 12 సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, 11 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, 60 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయాలు, పోస్టులను మంజూరు చేశారు. వీటితో అనేక మంది అధికారులకు పదోన్నతులు రానున్నాయి. ఇంజినీర్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఇప్పటికు పదోన్నతులు కల్పించగా.. కొత్తగా 740 పోస్టులను సైతం భర్తీ చేయనున్నట్లు తెలిపారు.  గౌరవ వేతనం:...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 2 వేల పీఓ ఉద్యోగాలు

Image
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది ఎస్బీఐ. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్  ఉద్యోగాలను  (Bank PO Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు  నోటిఫికేషన్  (SBI PO Notification) విడుదల చేసింది. మొత్తం 2 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది స్టేట్ బ్యాంక్ విద్యార్హతల వివరాలు: ఎస్‌బీఐలో పీఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని నోటిఫికేషన్లో పేర్క...

ప‌దో త‌ర‌గ‌తి ఇంటర్ అర్హతతో 7547 కానిస్టేబుల్ జాబ్స్ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది

Image
7547 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ఢిల్లీ పోలీసు విభాగంలో 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు సంబంధించి 5056 పోస్టులు, మహిళలకు సంబంధించి 2491 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభంకాగా.. సెప్టెంబ‌ర్ 30వ‌ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య :  7547 (పురుషులు 5056 పోస్టులు, మహిళలు 2491 పోస్టులు) పోస్టులు:  కానిస్టేబుల్ (ఎగ్జి...

పదో తరగతి అర్హతతో.. ఎయిర్‌ ఇండియాలో 998 ఉద్యోగాలు..

Image
  కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌స్పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌).. 998 ఒప్పంద ప్రాతిపదికన 166 హ్యాండీమ్యాన్‌, యుటిలిటీ ఏజెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల్లో హ్యాండీమ్యాన్‌ పోస్టులు 971, యుటిలిటీ ఏజెంట్‌ (పురుషులు 7, మహిళలు 20 ) పోస్టులు 27 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 18, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ కింది అర్హతలు ఉండాలి. హ్యాండీమ్యాన్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎస్‌ఎస్‌సీ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి. వయోపరిమితి తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. వయోపరిమితిలో రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ ...

భారత్‌ పెట్రోలియంలో పోస్టులు.. నెలకు రూ. 25 వేలు జీతం

Image
 ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొత్తగా పలు అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్(సవరణ) చట్టం, 1973 ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో చేసిన  చేసిన స్పెషలైజేషన్‌ ఆధారంగా అప్రెంటిస్‌ పోస్టుకు ఎంపిక చేస్తారు. ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. అయితే నిబంధనల ఆధారంగా వయసు విషయంలో వయో సడలింపు వర్తిస్తుంది. ఇందుకోసం పూర్తి నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుందని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస...

పదో తరగతి , ITI అర్హతతో రైల్వేలో 2,409 పోస్టులు..

Image
  భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో 2,409 యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనింగ్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా పదో తరగతి, ఐటీఐ అర్హతతో సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది.  ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, పీఎస్‌ఏఏ, మెకానిక్ డీజిల్, సీవోపీఏ, ఐటీ అండ్‌ ఈఎస్‌ఎం తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. వర్క్‌షాప్‌/యూనిట్ల వివరాలు ఇవే.. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్ (ముంబయి), పరేల్ వర్క్‌షాప్, మాతుంగ వర్క్‌షాప్, ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్ (బైకుల్లా), కల్యాణ్ డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (నాగ్‌పుర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (సోలాపూర్), కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీఈఈ (టీఆర్‌ఎస్‌ కల్యాణ్, కుర్లా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (భుసవల్), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (భుసవల్), టీఎండబ...