Posts

Showing posts from June, 2023

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

Image
  హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర స్థాయి చైల్డ్ హెల్ప్‌లైన్‌లోని డబ్ల్యూసీడీ కంట్రోల్ రూమ్‌లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో సమర్పి్ంచాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 20. ⏩ హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్: 01 ⏩ కాల్ ఆపరేటర్: 12  ⏩ ఐటీ సూపర్‌వైజర్: 01  ⏩ మల్టీ-పర్పస్ స్టాఫ్: 03 ⏩ సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: 03 అర్హత:   సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి:   25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం:   ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  30.06.2023 చిరునామా:    The Commissione...

నవోదయ విద్యాలయాల్లో 7,629 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

Image
 నవోదయ విద్యాలయ సమితి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో పీజీటీ, టీజీటీ టీచింగ్ పోస్టులతోపాటు, పలు విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత ప్రమాణాలు పీజీటీ(కంప్యూటర్ సైన్స్) ఈ ఉద్యోగాల్లో 306 భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. B.Ed కూడా తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. పీజీటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్ ) ఈ పోస్ట్‌లు 91 భర్తీ కానున్నాయి. అభ్యర్థులు M.P.Ed క్వాలిఫై అయి ఉండాలి. వారి వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. PGT (మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్) ఈ విభాగంలో భర్తీ కానున్న పోస్టులు 46. స...

ఇండియన్ ఆర్మీ‌ స్పెషల్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Image
భారత రక్షణ దళాల్లో సేవలు అందించాలనుకునే వారికి ఒక గుడ్‌న్యూస్. ఆర్మీలో వివిధ ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ వచ్చింది.  ఇండియన్ ఆర్మీ తాజాగా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్(SSC Tech)- 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివాహం కాని పురుష, మహిళా గ్రాడ్యుయేట్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ joinindianarmy.nic.in ద్వారా జులై 19లోపు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు 2024 ఏప్రిల్‌లో చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA)లో ట్రైనింగ్ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు SSC (టెక్) పురుషులు- 175 SSC (టెక్) మహిళలు- 19 SSCW టెక్ & నాన్ టెక్- 2   అర్హత ప్రమాణాలు అభ్యర్థుల వయసు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువుల గరిష్ట వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చే...

పది/ఇంటర్ అర్హతతో..... బీపీఎన్‌ఎల్‌లో 3444 పోస్టులు...

Image
  భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది సర్వే ఇన్‌ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టుల భ‌ర్తీకి రాజ‌స్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. జూలై 05 వ‌ర‌కు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు : 3444 పోస్టులు :  1. సర్వే ఇన్‌ఛార్జ్ – 574 పోస్టులు 2- సర్వేయర్ – 2870 పోస్టులు అర్హ‌త‌లు :  ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఎంపిక :  ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా దరఖాస్తు :  ఆన్‌లైన్‌లో వ‌య‌స్సు :  పోస్టుల‌ను బ‌ట్టి 1...

తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు..ఎంపిక విధానం ఇలా...

Image
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. విటిలో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు... ➥ కేజీబీల్లో ఖాళీలు పోస్టుల సంఖ్య: 1218 1) స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌వో): 38 పోస్టులు 2) పీజీ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్టీ):  849 పోస్టులు సబ్జెక్టులవారీగా ఖాళీలు:  ఇంగ్లిష్-110, మ్యాథమెటిక్స్-60, నర్సింగ్-110, తెలుగు-104, ఉర్దూ-02, బోటనీ-55, కెమిస్ట్రీ-69, సివిక్స్-55, కామర్స్-70, ఎకనామిక్స్-54, ఫిజిక్స్-56, జువాలజీ-54. 3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ): 254 సబ్జెక్టులవారీగా ఖాళీలు:  బయోసైన్స్-25, ఇంగ్లిష్-52, హి...

SCCL- సింగరేణి బొగ్గుగనుల్లో అప్రెంటిస్‌ ఖాళీలు.... అర్హత : 10వ తరగతి , ITI

Image
  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) హెచ్‌ఆర్‌డీ విభాగం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.   ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రేడ్‌లు :  ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హత :  పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి :  18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టైపెండ్ :  ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ :  ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు. దరఖాస్తు విధానం :  ఎస్‌సీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకు...

ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగాలు.. టీచింగ్, సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్..!

Image
ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38800 ఉద్యోగాలు.. టీచింగ్, సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్..! వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్, బదిలీల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) కోసం 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం వెల్లడించారు. * వచ్చే మూడేళ్లలో భారీగా నియామకాలు దేశవ్యాప్తంగా గుర్తించిన 740 బ్లాక్‌ల్లో 2025-26 నాటికి EMRS స్కూల్స్ ఏర్పాటుపై కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. వచ్చే మూడేళ్లలో ఈ పాఠశాలల్లో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 38,800 మంది ఉపాధ్యాయులు, ఇతర సహాయక సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 693 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. వీటిలో 175 పాఠశాలల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ ...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..నెలకు రూ.71,032 జీతం

Image
 భారత ప్రభుత్వ రంగానికి చెందిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ.. నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూన్‌ 1, 2023వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన వారు రూ.450, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.50 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జుల...

RAILWAY JOB: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

Image
 దక్షిణ మధ్య రైల్వే నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్  విడుదలైంది. సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను  భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నికల్ అసోసియేట్ పోస్టులను ఈ నోటిఫికేషన్  ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 35 కాగా.. కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా సమర్పించాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత : డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మె...

జల విద్యుత్ శాఖలొ 338 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Image
  జల విద్యుత్ శాఖ పరిధిలోని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్(NHPC)నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  NHPC జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (మెకానికల్), సూపర్‌వైజర్ (IT), హిందీ ట్రాన్స్‌లేటర్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), సీనియర్‌తో సహా పలు పోస్టులను ప్రకటించింది. అకౌంటెంట్. (NHPC రిక్రూట్‌మెంట్) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ (NHPC భారతి 2023) క్యాంపెయిన్ ద్వారా మొత్తం 388 పోస్ట్‌లను భర్తీ చేయాల్సి ఉంది, దీని కోసం అభ్యర్థులు జూన్ 30, 2023లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల కోసం (NHPC JE రిక్రూట్‌మెంట్ 2023) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు అంటే జూన్ 09 నుంచి NHPC అధికారిక వెబ్‌సైట్ nhpcindia.comలో ప్రారంభమైంది. అదనపు అర్హతతో రెగ్యులర్ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ ఇంటర్ CA పాస్/ మాస్టర్ డిగ్రీతో సహా కొంత విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 09 జూన్, 2023 దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్, 2023 ఖాళీల వివరాలు NHPC భారతి జూనియర్ ఇంజనీర్ (సివిల్) -...

తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 113 ఖాళీలు

Image
  తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాల(Ekalavya Gurukula)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి సబ్జెక్ట్‌ అసోసియేట్ల భర్తీకి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు (ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్‌ టైం సబ్జెక్ట్‌ అసోసియేట్లుగా పనిచేయాల్సి ఉంటుంది). మొత్తం పోస్టులు : 113 పోస్టులు  : పార్ట్‌టైం సబ్జెక్ట్‌ అసోసియేట్లు సబ్జెక్టుల వారీగా ఖాళీలు : గణితం-22, రసాయన శాస్త్రం-21, వృక్షశాస్త్రం-21, జంతుశాస్త్రం-25, భౌతికశాస్త్రం-24. అర్హతలు  : పోస్టుల‌ను బ‌ట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ(మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌), నీట్‌, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం ఉండాలి. ఎంపిక  : రాత ప‌రీక్ష‌, డెమో, ఇంటర్వ్యూ ద్వారా పరీక్ష ఫీజు : రూ.500 జీతం  : నెలకు రూ.32,500 దరఖాస్తు  :   ఆన్‌లైన్‌లో చివరి తేదీ : జూన్ 15 రాత పరీక్ష తేదీ:  జూన్ 25 డెమో/ఇంటర్వ్యూ త...

తెలంగాణా కులవృత్తి దారులకు 1లక్ష రూపాయల సబ్సిడీ - ఇలా అప్లై చేయండి..

Image
తెలంగాణా కులవృత్తి దారులకు 1లక్ష రూపాయల సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖస్తులు షురూ   ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించానున్న సీఎం కేసిఆర్ గారు  ఈ రోజే ఆన్లైన్ ఓపెన్ అయ్యింది.. తక్షణమే  మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://www.cgg.gov.in/ కావలసిన పత్రాలు 1.ఆధార్ కార్డు  2.కులం 3.కొత్త ఆదాయ సర్టిఫికెట్ -2023 4.నివాస ధృవ పత్రం 5.రేషన్ కార్డు 6.ఒక ఫోటో కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు                                                               

హైదరాబాద్ లో ప్రవైట్ కంపెనీలలో 5000 పైగా ఉద్యోగాలు... వెంటనే అప్లై చేయండి

Image
మీరు మీ క్వాలిపికేషన్‌కు తగ్గ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? మీ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మీ న్యూస్ హైదరాబాద్ లో ఈ నెల 9 వా తేదీన BRS నాయకుడు కృషన్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేలా జరుగుతుంది..  5000 పైగా ఉద్యోగాల కోసం 90 కంపెనీలు ఈ జాబ్ మెల లో  పాల్గొంటాయి .. మీ అర్హతకి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకోండి.. అర్హతలు : 7 వ తరగతి నుండి  M.TECH  వరకు ఎవరైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. స్థలం : గవర్నమెంట్ స్కూల్ , గ్రౌండ్ మూడ్ ఫోర్ట్ , కాంటున్మెంట్ , హైదరాబాద్  పూర్తి వివరాలకొరకు   QR  కోడ్ ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి..