Posts

Showing posts from December, 2023

రేషన్ షాపులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Image
  తెలంగా రాష్ట్ర ప్రభుతం, రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. నల్లగొండ డివిజన్‌లోని 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి ఆర్డీఓ రవి శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి, తాళ్లవెల్లెంల, వేంబాయి, కనగల్‌ మండలంలోని తుర్కపల్లి, లచ్చుగూడెం, కట్టంగూర్‌ మండలంలోని ఊదులూరు, నారగూడెం, పామనుగుండ్ల, యరసానిగూడెం, కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల, తాటికల్‌, నల్లగొండ మండలంలోని పానగల్‌, నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, శాలిగౌరారం మండలంలోని అంబారిపేట, ఊట్కూరు, ఉప్పలంచ, తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం, రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత ఉన్నవారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత గ్రామంలో నివసిస్తూ పదో తరగతి అర్హత ఉండి 18 నుంచి 40ఏండ్ల వయసు వారు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జనవరి 12న నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. విద్యార్హత : దర...

ఆదాయపు పన్ను శాఖ లో 291 ఉద్యోగాలు..

Image
ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్‌ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 291 స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. 2024 జనవరి 19 దరఖాస్తులకు చివరితేది. మొత్తం ఖాళీలు : 291 ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌): 137 పోస్టులు క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు ముఖ్య సమాచారం : క్రీడాంశాలు:   ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా - పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్‌బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాలున్నాయి. అర్హత:  పోస్టులను బట్టి 10వ తగరతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. జీతం వివరాలు: ఇన్‌స్పెక్టర్...

LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు

Image
  ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌(LICHFL) శాఖల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది... దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. ఖాళీల వివరాలు * అప్రెంటిస్‌: 250 ఖాళీలు (ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో 30 ఖాళీలున్నాయి) శిక్షణ వ్యవధి:  12 నెలలు. అర్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. స్టైపెండ్ :  నెలకు రూ.9,000 - రూ.15,000. ఎంపిక ప్రక్రియ :  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472. ముఖ్య తేదీలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 22.12.2023. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 31.12.2023. పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ : 03-01-2024. రాత పరీక్ష తేదీ: 06-01-2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ తేదీలు :...

TS JOB MELA | జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన యువతీ యువకులకు శుభవార్త!

Image
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకుల కోసం పలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కల్పన కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాసులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ సర్టిఫికెట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 28 అనగా గురువారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి రాఘవేంద్ర తెలిపారు. మరిన్ని వివరాలకు 8919914978 , 9985346768 , 986635753 1 నెంబర్స్‌ను సంప్రదించాలని కోరారు. గతంలో కూడా సిరిసిల్ల జిల్లా వ...

ఎయిర్‌పోర్ట్స్’‌లో 119 జాబ్స్... అర్హత , 10 , డిగ్రీ

Image
 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో జూనియర్​ అసిస్టెంట్ ​(ఫైర్​ సర్వీస్​) పోస్టులు 73, సీనియర్​ అసిస్టెంట్​(ఎలక్ట్రానిక్స్​) పోస్టులు 25,  సీనియర్​ అసిస్టెంట్​(అకౌంట్స్​) పోస్టులు 19, జూనియర్​ అసిస్టెంట్​(ఆఫీస్​) పోస్టులు 02 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసినవారు జూనియర్​ అసిస్టెంట్ (ఆఫీస్​), సీనియర్​ అసిస్టెంట్​ (అకౌంట్స్​) పోస్టులకు అర్హులు. జూనియర్​ అసిస్టెంట్​ (ఫైర్​ సర్వీస్​) పోస్టులకు 10వ తరగతి, ఇంటర్​, మెకానికల్/​ ఆటోమొబైల్​/ ఫైర్ డిప్లొమా హోల్డర్లు, హెచ్ఎంవీ, ఎల్ఎంవీ లైసెన్సు కలిగిన వారు అర్హులు. సీనియర్​ అసిస్టెంట్​ (ఎలక్ట్రానిక్స్​) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్ ​/రేడియో ఇంజినీరింగ్ డిప్లొమా కలిగిన వారు(Airport Jobs) అర్హులు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు కల్పిస్తారు. ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఎక్స్​- సర్వీస్​మెన్​, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్  ఫీజు లేదు. మిగతా కేటగరీల అభ్యర్థులు రూ.1...

ఇండియన్ నేవీలో 910 ఉద్యోగాలు

Image
  ఇండియన్ నేవీలో ఛార్జ్‌మ్యాన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభమైంది.       పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగం   లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 18న ప్రారంభమైంది. అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  దరఖాస్తుల పరిశీలన ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తుది ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 - రూ.56,900 వరకు జీతంతోపాటు ఇతర భత్యాలు ఉంటాయి.  వివరాలు.. ఖాళీల సంఖ్య: 910 పోస్టులు I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ ➥ ఛార్జ్‌మ్యాన్...

పదవ తరగతితో CBI బ్యాంక్ లో ఉద్యోగాలు ..

Image
  బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central bank of india) సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.  ఈ  రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 484 శానిటేషన్ వర్కర్ల సబ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జనవరి 9, 2024. ఈ పోస్ట్ కి అప్లయ్ చేసేముందు ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి. అర్హత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి మార్చి 31, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అంతేకాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వబడుతుం...

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Image
 తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు .... ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో 31 పోస్టులను కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానము లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు...  పోస్టుల పేర్లు : మేనేజర్ / కో ఆర్డినేటర్, సోషియల్ వర్కర్, GNM, ANM, ప్రీ స్కూల్ టీచర్, పీడియాట్రీసియన్, చౌకీదార్, ఆయా, అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు, కేస్ వర్కర్స్... పోస్టుల సంఖ్య : 31 ( ఇందులో 18 కాంట్రాక్టు ఉద్యోగాలు, 13 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి) మేనేజర్ / కో ఆర్డినేటర్ - 04 సోషియల్ వర్కర్ - 03 ప్రీ స్కూల్ టీచర్ - 01 పీడియాట్రీషియన్ – 01 చౌకీదార్ - 02 ఆయా - 02 అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01 చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు – 02 కేస్ వర్కర్స్ - 11 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. (పూర్తి నోటిఫికేషన్ చూడండి )   అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-12-2023   అప్ల...

10 తరగతితో NTPC మైనింగ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

Image
NTPC మైనింగ్ లిమిటెడ్ మైనింగ్ ఓవర్ మాన్ మ్యాగజైన్ ఇంచార్జ్ మెకానికల్ సూపర్వైజర్ మరియు అనేక ఇతర పోస్టులతో సహా 114 స్థానాలకు రిక్రూట్మెంట్ ప్రక్రియ డిసెంబర్ 12 నుంచి ప్రారంభించింది .... మొత్తం ఖాళీలు : 114 * మైనింగ్ ఓవర్మన్ 52 పోస్ట్లు * మ్యాగజైన్ ఇంఛార్జ్ 07 పోస్ట్లు * మెకానికల్ సూపర్వైజర్ 21 పోస్టులు * ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 13 పోస్టులు * వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 03 పోస్ట్లు - ▪ జూనియర్ మైన్ సర్వేయర్ - 11 పోస్ట్లు * మైనింగ్ సర్దార్ 07 పోస్ట్లు   అర్హతలు  : 10  తరగతిమరియు సంబంధిత విభాగంలో డిప్లమా వయోపరిమితి  : గరిష్ట వయసు 30 సంవత్సరాలు లోపు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు సడలింపులింపు ఎలా దరఖాస్తు చేయాలి >> https://careers.ntpc.co.in/recruitment/ వెబ్సైట్ను యాక్సెస్ చేయండి >> హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ లింక్ను గుర్తించండి >> "NTPC Mining Limited- Recruitment of experienced persons in coal mining. Applications start date 12. 12. 2023" క్లిక్  చేయండి. >> అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్ను పూర్తి చేయండి >> దరఖాస్తు రుసుము చెల్లింపును ప్రా...

అంగన్‌వాడీ కేంద్రాల్లో 14 వేల పోస్టుల భర్తీ - మంత్రి సీతక్క

Image
 నిరుద్యోగులకు తీపికబురు. మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఉద్యోగ నియామకాలపై అదిరే గుడ్ న్యూస్ అందించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటించింది. ఇంతకీ ఏ ఏ ఖాళీలను భర్తీ చేయనున్నారు? అనే అంశాన్ని మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఖాళీగా ఉన్న నియామకాల భర్తీ వల్ల నిరుద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ మంత్రి సీతక్క తాజాగా ఉద్యోగ నియామకాలపై ముఖ్యమైన ప్రకటన చేశారు. తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలియజేశారు. ఏకంగా 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్న సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. అంగన్‌వాడీలో ఉద్యోగ నియామకాల వల్ల ఎక్కువగా మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఈ నియామకాలకు ఎలాంటి అర్హతలను నిర...

పదవ తరగతితో రైల్వేలో 3015 అప్రెంటిస్ ఉద్యోగాలు

Image
  రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌(RRC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.  వెస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.   మొత్తం ఖాళీలు : 3015  ట్రేడ్‌లు:  మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్‌, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్‌ కీపర్‌, మెషినిస్ట్‌, మాసన్‌, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హత: పదవ తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ   దరఖాస్తు : ఆన్‌లైన్  ఎంపిక: రాత పరీక్ష  దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.136, SC/ST/PwBD, మహిళలకు రూ.36.  దరఖాస్తు ప్రారంభం తేదీ : 15 డిసెంబర్ 2023  దరఖాస్తు చివరి తేదీ : 1...