Posts

Showing posts from October, 2022

స్టీల్ ప్లాంట్ 261 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు

Image
ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), రవుర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.. 1. ట్రేడ్ అప్రెంటిస్- 113 2. టెక్నీషియన్ అప్రెంటిస్- 107 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 41 మొత్తం ఖాళీలు :  261 అర్హత : సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు : (30-11-2022 నాటికి) 18 నుంచి 24 సంవత్సరాలు.  ఎంపిక: సంబంధిత బ్రాంచి/ ట్రేడు విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30-11-2022. వెబ్సైట్ : www./sail.co.in/en/home

తిరుపతిలోని పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ లో 20 టీచింగ్ పోస్టులు..

Image
తిరుపతిలోని పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 1. టీచింగ్ అసోసియేట్ 02 పోస్టులు 2. టీచింగ్ అసిస్టెంట్: 20  పోస్టులు అర్హతలు : అగ్రి బీఎస్సీ, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), పీ హెచ్ (అగ్రికల్చరల్) ఉత్తీర్ణత. వయసు : టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, టీచింగ్ అసోసియేట్ పోస్టులకు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు. వేతనాలు : టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000,  టీచింగ్ అసోసియేట్ పోస్టులకు రూ.54,000 వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 31.10.2022  వేదిక : అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి. వెబ్సైట్: https://angrau.ac.in/

డిగ్రీతో కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీలు.. ఖాళీలు: 15

Image
కేంద్ర విభాగాల్లో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, 3 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 1. ఎక్స్టెన్షన్ ఆఫీసర్: 01 పోస్టు 2. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(బయాలజీ): 01 పోస్టు  3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(కెమిస్ట్రీ): 01 పోస్టు 4. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1: 12 పోస్టులు   మొత్తం ఖాళీలు : 15. అర్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   వయసు : 27-10-2022 నాటికి ఇన్వెస్టిగేటర్, జూనియర్సైం  టిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు రుసుము : రూ.25 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10-11-2022. వెబ్సైట్ : https://www.upsc.gov.in/

నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో అసిసెంట్ మేనేజర్లు పోస్టులు

Image
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో అసిసెంట్ మేనేజర్లు న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్ హెచ్బీ), ఒప్పంద/ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1. చీఫ్ ఎకనామిస్ట్ : 01 పోస్టు 2. ప్రోటోకాల్ ఆఫీసర్: 02 పోస్టులు 3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6): 01 పోస్టు 4. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1)- జనరల్/ హిందీ: 16 పోస్టులు 5. ఆఫీసర్(సూపర్విజన్: 06 పోస్టులు 6. రీజనల్ మేనేజర్ (స్కేల్-4)- కంపెనీ సెక్రటరీ: మొత్తం ఖాళీలు : 27. విద్యార్హత : బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ఎ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక : ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము : రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.11. 2022.  ఆన్లైన్ పరీక్ష తేదీ : డిసెంబర్ 2022 జనవరి 2023.  వెబ్సైట్: https://nhb.org.in/en/

సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు. 530 ఖాళీల భర్తీ ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Image
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనుంది.. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 530 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో ప్రాజెక్ట్ అసోసియేట్ (30), ప్రాజెక్ట్ ఇంజనీర్ (250), ప్రాజెక్ట్ మేనేజర్ /ప్రోగ్రాం మేనేజర్ /ప్రోగ్రాం డెలివరీ మేనేజర్ /నాలెడ్జ్ పార్ట్ నర్ (50), సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్ (200) ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బీఈ, బీ...

ఐఆర్‌సీటీసీలో ( IRCTC ) 80 జాబ్స్... ఒక్క రోజు మాత్రమే గడువు ..

Image
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ నోటిఫికేషన్ ద్వారా 80 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి...  ఐటీఐ పాసైనవారికి గుడ్ న్యూస్. ఐటీఐ అర్హతతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఐఆర్‌సీటీసీ నార్త్ జోన్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల్ని (Apprentice Trainee Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇవి ఏడాది గడువున్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష లేదు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి ఐఆర్‌సీటీసీలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 25 చివరి తేదీ . విద్యార్హతల వివరాలు చూస్తే 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో ...

డిగ్రీ ఉత్తీర్ణతతో 864 NTPC లొ ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు..నెలకు రూ.40,000 నుంచి

Image
.. పూర్తి వివ‌రాలు ఇవే.. న్యూఢిల్లీలోని  ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ-2022 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల  మొత్తం పోస్టుల సంఖ్య : 864 ఇంజనీరింగ్‌ విభాగాలు : ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్‌. అర్హత : కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌(గేట్‌)-2022కి హాజరై ఉండాలి. వయసు : ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది నాటికి 27ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 ఉంటుంది. ఎంపిక విధానం : గేట్‌-2022 స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది : 28.10.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది :11.11.2022 వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/

రాత పరీక్షలేకుండానే నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో భారత ప్రభుత్వ ఉద్యోగాలు..

Image
  భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌..... 17 సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ తదితర పోస్టుల.. భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌.. 17 సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌, చీఫ్‌ ఇంజనీర్‌/పోర్ట్‌ క్యాప్టెయిన్‌  పోస్టుల  భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆప్తల్మాలజీ, అబ్‌స్టేట్రిక్స్ అండ్‌ గైనకాలజీ, అనెస్తీషియా, ఫీజీషియన్‌, డెర్మటాలజీ, చీఫ్‌ ఫీజీషియన్‌, హాస్పిటల్‌ అడ్మినిష్ట్రేషన్‌, చీఫ్‌ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/పీజీ డిప్లొమా, మోటర్‌ సర్టిఫికెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్త...

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రైమరీ కీ ఎప్పుడంటే? తాజా అప్డేట్ ఇదే...

Image
  ఈ నెల 16న గ్రూప్-1 పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల పై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. 8 పని దినాల్లో ప్రైమరీ కీని విడుదల చేస్తామని గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో వెల్లడించింది ఈ మేరకు గడువులోగానే ప్రైమరీ కీని విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే కీని విడుదల చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం నాటికి జిల్లాల నుంచి ఓఎంఆర్ షీట్లు రాజధానికి చేరకోగా.. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించారు టీఎస్పీఎస్సీ అధికారులు. పండుగ సెలవులు పోగా.. ముందుగా ప్రకటించిన మేరకు 8 వర్కింగ్ డేస్ లో కీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ.. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఖండించారు. ఇటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేశారు.. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ డి స...

డిగ్రీ ఉంటే చాలు.. నెలకు రూ.2,16,600 జీతం పొందొచ్చు..

Image
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(National Informatic Centre) పలు పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్ఐసీలో 127 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  www.calicut.nielit.in ని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కొరకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అభ్యర్థులు నవంబర్ 21వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 127 ఉన్నాయి. దీనిలో  విభాగాల వారీగా ఇలా.. ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, రేడియో ఫిజిక్స్ & ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్, కమ్యూనికేషన్, కంప్యూటర్ మరియు నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేటిక్స్, ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, సైబర్ లా, బయో-ఇన్ఫ...

డిగ్రీ తో జిల్లా కోర్టుల లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే ..

Image
  ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది శుభవార్త లాంటిది. తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పని చేసేందుకు రెండు జిల్లాల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో(Telangana District Court) పని చేసేందుకు జిల్లాల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లా కోర్టుల నుంచి దీనికి సంబంధించి ఉద్యోగ నోటఫికేషన్లు విడుదలయ్యాయి. అందులో మొదటగా..  నిజామాబాద్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థి కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను తగిన అర్హత పత్రాలతో పాటు.. నోటిఫికేషన్ చివరలో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి. దానిలో మీ వివరాలను నింపి.. సర్టిఫికేట్లతో పాటు.. రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా PRL. District And Session Judge, Nizamabad అడ్రస్ కు పంపించాలి. 31. 10. 2022 వరకు ఆ దరఖాస్తులను పంపవచ్చు దీనిలో మొత్తం పోస్టులు 12 ఉన్నాయి. సీనియర్ సూపరింటెండెటంట్ - 01, (ఈ పోస్టులకు రిటైర్డ్ Judicia...

బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్ పోస్టులు

Image
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా 12 ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు : క్లౌడ్ ఇంజినీర్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్ ప్రైజ్ ఆర్కిటెక్ట్, ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ తదితరాలు. అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. అనుభవం : కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు : 32-45 ఏళ్లు మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.10.2022 వెబ్సైట్: https://www.bankofbaroda.in/

సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో ప్రవేశాలు

Image
సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎంఏ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ భువనగిరిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులో ప్రవేశాలకు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సీట్ల సంఖ్య : 40 అర్హత : 2021-22లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.  తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, లెక్చరట్, ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 25.10.2022. ప్రవేశ పరీక్ష, ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్ట్ తేదీ: 30.10.2022.  వెబ్సైట్ : https://www.tswreis.ac.in/

SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు.. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలు....

Image
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.  ఎస్ బీఐ సర్కిళ్లు : భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్. అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.  వయసు : 30-09-2022 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం : 36000 నుండి 63840  ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో.  దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: గుంటూరు,కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.  పిడిఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  https://jobalertshub.com/wp-content/uploads/sbi-adv-details-for-circle-based-officer-posts_jobalertshub.pdf ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-...

46 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం.. ఆ రాష్ట్ర యువతకు అదిరిపోయే శుభవార్త..

Image
  ఒకే సారి 46 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మొత్తం 46,500 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గెహ్లాట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లెవల్-1, లెవల్-2, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇటీవల బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా 75000 ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలపై భారీగా దృష్టి సారించాయి. దేశంలో నిరుద్యోగ రేటు భారీగా పెరగడంతో యువత నుంచి వస్తున్న వ్యతిరేఖత నేపథ్యంలో ఈ నియామకాలను చేపట్టాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి కేసీఆర్ సర్కార్ సైతం 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.  ఇందులో భాగంగా ఇప్పటికే గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలు సైతం పూర్తయ్యాయి. టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే టెట్ ను సైతం నిర్వహించింది తెలంగాణ విద్యాశాఖ.  తెలంగాణలోనూ మరికొన్ని రోజుల్లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం త్...

రూ.1,24,150 వేతనంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్..

Image
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది.. తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 833 పోస్టులతో మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి మొత్తం 833 ఖాళీలు ఉండగా అందులో  అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్)- 62,  అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్...

హైదరాబాద్ లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో 13 ఖాళీలు

Image
జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో.. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్.. ఒప్పంద ప్రాతిపదికన 13 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డైరెక్టర్ (ఎంఐఎస్): 1 పోస్టు సీనియర్ పీహెచ్పీ డెవలపర్: 3 పీహెచ్పీ డెవలపర్ 2 సీనియర్ పైతాన్డెవలపర్: 2  కేబీ టెక్ సపోర్ట్ టీమ్: 5 పోస్టులు అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. వయసు: డైరెక్టర్ పోస్టులకు 55 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది). ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27.10. 2022, ఆన్లైన్ దరఖాస్తు డీడీని పోస్టు ద్వారా స్వీకరించేందుకు  చివరి తేదీ: 03-11-2022,  వెబ్సైట్: http://nirdpr.org.in/

ఇంటర్‌ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు ఏపీ, తెలంగాణ వారికే ఛాన్స్‌..

Image
ఇండియన్‌ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహిస్తోంది. చెన్నైనలోని ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో వేలూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని రిక్రూటింగ్ ఆఫీస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/ నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనవచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 /ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్) ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. * అభ్యర్థుల వయసు 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * ర్యాలీని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక...

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి... ఖాళీలు 110

Image
  బ్యాంక్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాత పరీక్ష లేకుండానే వివిధ పోస్టుల భర్తీకి ఈ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ.. దీని ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో స్పెషల్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అనుభవజ్ఞులైన, ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది.  దరఖాస్తు   చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 17.2022 . కాగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ Centralbankofindia.co.in ద్వారా అప్లై చేయవచ్చు. * ఖాళీ పోస్టులు ఇవే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్‌తో రిస్క్ మేనేజర్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, ఎకనమిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది . నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీల సంఖ్య 110. అప్లై చేసుకున్న వారిలో అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి నవంబర్ నెలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరు ఎలాంటి రాతపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల అర్హతను బట్టి ఇంటర్వ్యూ ద్వారా ఎం...